కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి నియోజకవర్గం, నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డిలో శనివారం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, జిపిసెక్రెటరీతో కలిసి స్థానిక ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. సర్పంచ్, పాలకవర్గ సభ్యుల సహకారంతో పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారని, ఇక్కడ నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. దీని ఫలితంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని ఉపాధ్యాయులు ఎంపీడీవోకు వివరించారు. ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, సర్పంచ్, పాలకవర్గ సభ్యులను, గ్రామస్తులను, ఉపాధ్యాయులను అభినందించారు.