ఆర్య వైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు, ఎల్లారెడ్డి ఆర్యవైశ్య సంఘం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలభిషేకం చేశారు. ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను పురస్కరించుకొని స్థానిక వైశ్య భవన్ లోని శ్రీ వాసవి మాత ఆలయం ఆవరణలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సిద్ది శ్రీధర్ గుప్త ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.