కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీట్ విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాన్ని సహించబోమని ఆయన అన్నారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.