ఎల్లారెడ్డి యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు సర్దార్ నాయక్ ఆధ్వర్యంలో సీఎం. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతల చిత్రపటాలకు నాగిరెడ్డిపేట్ లో శనివారం పాలాభిషేకం చేసారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు అసెంబ్లీ తీర్మానం చేసి ఆర్డినెన్స్ పంపినందుకు వారు హర్షం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ నేతలు రాజేశ్వర్ గౌడ్, గులాం హుస్సేన్, నాగిరెడ్డిపేట్ మండల అధ్యక్షులు శ్రీరామ్ గౌడ్ పార్టీ నేతలు పాల్గొన్నారు.