చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా చూడాలని కలెక్టర్ తల్లిదండ్రులకు సూచించారు.

సంబంధిత పోస్ట్