కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, విద్యాశాఖ ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా ఫిన్లాండ్‌ను సందర్శించిన గాంధారి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు భవానిని అభినందించారు. ఈ సందర్భంగా భవాని, ఫిన్లాండ్‌లోని విద్యా విధానం, మౌలిక వసతులు, మాతృభాషకు ప్రాధాన్యత, వృత్తి విద్యకు ప్రోత్సాహం వంటి అంశాలను కలెక్టర్‌కు వివరించారు. ఫిన్లాండ్‌లోని ఉత్తమ విద్యా విధానాలను జిల్లా పాఠశాలల్లోనూ అమలు చేయాలని ఆమె సూచించారు.