ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరును పరిశీలించిన కలెక్టర్

ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుడు నిర్మిస్తున్న ఇంటిని పరిశీలించి, నిర్మాణ పనుల పురోగతిని గమనించారు. లబ్ధిదారుడితో మాట్లాడి, ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చు, రుణ వివరాలు, ప్రభుత్వ నిధుల కేటాయింపు, గత నివాసం, ప్రస్తుతం చేస్తున్న పని వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్