ఎల్లారెడ్డిలోని నరసన్నపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి, వారి విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు, పాఠశాల సౌకర్యాలపై ఆరా తీశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించిన కలెక్టర్, పాఠశాలలో అదనపు మరుగుదొడ్లు, పరిశుభ్రత, మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.