కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ శుక్రవారం కామారెడ్డిలో మాట్లాడుతూ, క్రమశిక్షణను ఉల్లంఘించే వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయని, నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలను కించపరిచే విధంగా ఆన్లైన్ పత్రికల్లో ప్రచురితమైన వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మహిళలను కించపరిచే వార్తలు ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మహిళలను గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు.