సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

కామారెడ్డి జిల్లా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని కామారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. షబ్బీర్ అలీ, ఆయన తనయుడు ఇలియాస్, అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళనైనా తాను రాజకీయంగా ఎదగడాన్ని ఓర్వలేకనే ఈ కుట్రలు పన్నుతున్నారని ఇందుప్రియ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అమ్ముడుపోయే వ్యక్తి షబ్బీర్ ఆలీనే అని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిలో ఒక హిందూ మహిళా నాయకురాలిపై అసభ్య పదజాలం వాడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పార్టీ రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్