కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జిల్లా సమగ్ర అభివృద్ధి

కామారెడ్డి కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తాగునీటి, సాగునీటి ప్రాజెక్టుల సమర్థ అమలుతో రైతులకు ఉపశమనం లభిస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయడానికి పటిష్ట పర్యవేక్షణ అవసరమని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ మాట్లాడుతూ, వేసవిలో ఎండ తీవ్రతను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, గ్రామ పంచాయతీలు, కార్యాలయాల్లో మంచి నీటి వసతి కల్పిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్