ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషితో రూ. 45 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు పప్పు వెంకటేశం తెలిపారు. శనివారం ఆయన రోడ్డు పనులను పరిశీలించారు. కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంపై వార్డు ప్రజల తరఫున ఎమ్మెల్యేకు అయన కృతజ్ఞతలు తెలిపారు.