ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్లో ఓ గృహ జ్యోతి పథకం కింద వున్న విద్యుత్ వినియోగదారునికి రూ. 9, 876 కరెంట్ బిల్లు రావడంతో లబోదిబోమన్నాడు. ప్రతినెలా జీరో బిల్లు వచ్చేది. ఈసారి ఏకంగా 1, 096 యూనిట్లకు రూ. 9, 876 బిల్లు వచ్చింది. ఈ విషయమై విద్యుత్ శాఖ అధికారులకు వివరణ కోరగా.. రూ. వంద చలానాతో ఎస్బీఐ, కామారెడ్డి ట్రాన్స్కో డిపార్ట్మెంట్పై డీడీ చెల్లిస్తే అందుకు కారణాలు గుర్తిస్తారని తెలపడం విశేషం.