కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం సిద్ధరామేశ్వర నగర్ శివారులో ఆదివారం అతివేగంతో దూసుకొచ్చిన కంటైనర్, ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నిజామాబాద్ నగరానికి చెందిన పద్మ, సృజన్ మోహన్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. కంటైనర్ కారును కొద్ది దూరం ఈడ్చుకెళ్లడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.