సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పించడం కోసం నిరంతర కృషి

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, పోలీస్ శాఖ సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు రక్షణ కల్పించడానికి నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' అనే సైబర్ అవగాహన కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 12 వరకు 6 వారాల పాటు జరిగే ఈ ప్రణాళికలో, ప్రతి వారం ప్రత్యేక సైబర్ భద్రతా అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించబడుతుంది. వ్యక్తిగత సమాచార రక్షణ, ఆన్లైన్ లింకులు, అనుమానాస్పద ఫోన్కాల్స్, డబ్బు బదిలీపై జాగ్రత్తలు, సైబర్ స్మార్ట్గా ఉండటం, అవగాహనను ఇతరులకు పంచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్