ఎల్లారెడ్డి సొసైటీలో సోమవారం సహకార వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సహకార గీతాలాపన, సహకార ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు ఏగుల నర్సింలు, ఉపాధ్యక్షుడు మత్తమాల ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ, సొసైటీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని, రైతుల సంక్షేమం కోసం ఇది పనిచేస్తుందని, రైతులు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.