కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్త, కమిషనర్ జగ్జీవన్ శుక్రవారం పరిశీలించారు. పనులు నాణ్యతగా, మన్నికగా చేపట్టాలని కాంట్రాక్టర్కు సూచించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా వార్డులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ మత్తమాల భాగ్యలక్ష్మి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.