కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 7, 8, 27 వార్డుల్లో సీపీఎం పోటీ చేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తోందని, సీపీఎం అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోని, స్వలాభాల కోసం వ్యాపారాలు, కబ్జాలకు పాల్పడే నేతలకు ఓటు వేయవద్దని ఆయన సూచించారు.