ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ముత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్ లో మంగళవారం రాత్రి జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఊహించని రీతిలో భారీ సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి, సాంస్కృతిక ప్రదర్శనలు, జీవదాన్ హైస్కూల్ విద్యార్థుల నృత్యాలు, గ్రామాల నుండి వచ్చిన చిన్నారుల ప్రదర్శనలు సభికులను అలరించాయి. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సమ్మేళనం విజయవంతమైంది. హాజరైన వారికి రాత్రి భోజన సౌకర్యం కల్పించారు.