ఎస్పీ రాజేష్ చంద్రను కలిసిన డీసీసీ అధ్యక్షుడు... ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఇటీవల జిల్లా డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీని శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణకు పోలీస్ శాఖ పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి శాంతియుత వాతావరణంలోనే సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్