కామారెడ్డిలో కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి

తెలంగాణ ఉద్యమకారుడు, అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి బీసీ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ కోసం కిష్టయ్య తుపాకీతో కాల్చుకుని ప్రాణత్యాగం చేయడం గొప్ప విషయమని బీసీ సంఘ నాయకుడు రాజేశ్వర్ అన్నారు. కామారెడ్డికి కానిస్టేబుల్ కిష్టయ్య పేరు పెట్టాలని, తెలంగాణ సర్కార్ ఈ విషయంలో ఆలోచించి కానిస్టేబుల్ కిష్టయ్య జిల్లాకు నామకరణం చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్