కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం (కల్కి ఆలయం)లో మంగళవారం అన్న ప్రసాద వితరణ జరిగింది. తపస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి పుల్గం రాఘవ రెడ్డి ఆర్థిక సహకారంతో 300 మందికి అన్నదానం చేశారు. ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్, డాక్టర్. బాలు మాట్లాడుతూ, ప్రతి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇది ఎంతోమంది పేదల ఆకలిని తీరుస్తుందని తెలిపారు. అన్నదాతగా సహకరించిన రాఘవ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.