గాంధారి మండలం జువ్వాడి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు, స్కూల్ యూనిఫామ్, పుస్తకాలు గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు భూమేష్, మండల యూత్ ఉపాధ్యక్షులు వినయ్, ఇందిరమ్మ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు సంతోష్, సాయిలు, వీడీసీ చైర్మన్ శ్యామ్, శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి చంద్రకాంత్, హెడ్ మాస్టర్ ప్రకాశ్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.