ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియల్ గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారురాలు పడమటి కౌసల్య ఇంటి నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా ఇళ్లను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్