ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను, గురువారం జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, ఆర్డీఓ పార్థ సింహారెడ్డితో కలిసి పరిశీలించారు. మొదటి విడతలో ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు ప్రశాంతంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ డి. నిజాం, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.