దోమకొండలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమగ్ర వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. గ్రామంలోని వివిధ వీధుల్లో నిర్వహించిన శిబిరాల్లో అనేక వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐసిటీసీ కౌన్సిలర్ నాగరాజు, ఎస్టీఎస్ శ్యామ్‌కుమార్, సూపర్వైజర్ ప్రేమలతతో పాటు పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.