ఎల్లారెడ్డి మండల వ్యవసాయ అధికారిణి శోభ రైతులకు తమ పొలాల్లో వరి కొయ్యలను కాల్చవద్దని విజ్ఞప్తి చేశారు. పంట కోత తర్వాత మిగిలిన కొయ్యలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతిని, పంట దిగుబడి తగ్గుతుందని, గాలి కాలుష్యం పెరిగి, నత్రజని, భాస్వరం, ఫొటాష్ వంటి విలువైన పోషకాలు నశిస్తాయని, భూమిలోని సూక్ష్మజీవులు చనిపోతాయని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపి శ్వాసకోశ వ్యాధులు వస్తాయని ఆమె తెలిపారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల కలిగే నష్టాలను వివరించారు.