మంగళవారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మద్నూర్, డోంగ్లీ, బిచ్కుంద మండల కేంద్రాలలోని మార్కెట్ యార్డులలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 2400 మద్దతు ధర నిర్ణయించిందని, రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను అమ్మి ప్రయోజనం పొందాలని ఆయన సూచించారు.