ఆందోళన వద్దు అండగా ఉంటాం: రైతులకు మాజీ ఎమ్మెల్యే భరోసా

ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు నష్టం జరగకుండా అండగా ఉంటామని ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ అన్నారు. సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి, ధర్మారావుపేట్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలలో తడిసిన వరి పంటను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తరలింపులో జాప్యం వల్ల మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిపోయిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ, అకాల వర్షంతో తడిసిన పంట వివరాలను తెలుసుకొని, సంబంధిత శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడి దుస్థితిని వివరించారు.

సంబంధిత పోస్ట్