సకాలంలో రక్తాన్ని అందజేయడం అభినందనీయం

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ (38) కి ఆదివారం ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో విశాల్ రెడ్డి సహకారంతో రక్తాన్ని సకాలంలో అందజేసినట్లు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. రక్తనిధి కేంద్రాలలో రక్త కొరత ఏర్పడిందని, ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారని, కావున యువత మానవత దృక్పథంతో రక్తదానానికి ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్