కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం 'సనోరా' పేరుతో అత్యాధునిక పిల్లల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆసుపత్రిని సికింద్రాబాద్‌లోని నేరెడ్మేట్ సైనిక్ పురిలో ఉన్న స్నేహితడైన మరో పిల్లల వైద్యునితో కలిసి డాక్టర్ కృష్ణ సుంకం నెలకొల్పారు. ఎల్లారెడ్డికి చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్ బి. నాగేశ్వర రావు చిన్న పిల్లల శస్త్రచికిత్స గదిని ప్రారంభించి, డాక్టర్ కృష్ణ సుంకంను అభినందించారు. ఈ ఆసుపత్రిలో చిన్న పిల్లల వైద్యం కోసం అన్ని సౌకర్యాలు కల్పించారు.