పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ శ్రీనివాస్ రావు

ఎల్లారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, స్థానిక డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు శనివారం జడ్పి బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. 12 వార్డుల పరిధిలో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఫిబ్రవరి 11న పార్టీల గుర్తులపై ఎన్నికలు జరగనున్నాయి. 12 వార్డులలో ఎన్నికల నిర్వహణకు 8 పోలింగ్ కేంద్రాలు, 24 బూత్ లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ రాజిరెడ్డి, ఎస్ఐ మహేష్ కూడా డీఎస్పీ వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్