అజామాబాద్ లో విద్యుత్ శాఖ అధికారుల ప్రజాబాట

ఎల్లారెడ్డి మండలంలోని అజాంబాద్ గ్రామంలో మంగళవారం విద్యుత్ శాఖ ఏఈ వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం జరిగింది. క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం, ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. రైతులు విద్యుత్ సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్ షాక్ నుండి రక్షణ, ట్రాన్స్ఫార్మర్ల వద్ద అధికారుల అనుమతి లేకుండా పనులు చేయరాదని ఏఈ వెంకటస్వామి వివరించారు.

సంబంధిత పోస్ట్