అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా సోమవారం సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామ స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం జనగామకు చెందిన చాకలి చిన్న రాజయ్య, శివరాజవ్వ బంధువుల అంత్యక్రియలకు వెళ్లారు. రాత్రి అంత్యక్రియలు ముగించుకుని గ్రామం నుంచి హైవేపై ఉన్న మర్కల్ జంక్షన్ వద్ద నడుస్తూ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చాకలి చిన్న రాజయ్య(58) అక్కడికక్కడే మృతి చెందాడు.