ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శుక్రవారం తన జన్మదినం సందర్బంగా రామారెడ్డిలో దక్షిణ కాశీగా పిలవబడే శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేచే పూజలు చేయించారు. అనంతరం ఆశీర్వచనలు ఇచ్చారు. ఎల్లారెడ్డి ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, వానలు సమృద్ధిగా కురిసి రైతు ఆనందంగా ఉండాలని కాలభైరవస్వామిని మొక్కినట్లు తెలిపారు.