ఎల్లారెడ్డి మండలంలో సుదీర్ఘ కాలం పాటు ఉపాద్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా, చివరగా మండల విద్యాధికారిగా విశిష్ట సేవలు అందించిన విశ్రాంత ఎంఈఓ పాత శైలయ్య శనివారం తెల్లవారు జామున స్వర్గస్థులయ్యారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి వారు ఉన్నత స్థాయికి ఎదగడానికి ఆయన ఎంతో కృషి చేసారు. గత కొంతకాలంగా ఆయన కామారెడ్డిలో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు.