అన్ని వున్న అల్లుని నోట్లో శని అన్న చందంగా ఎల్లారెడ్డి బస్ స్టాండ్ దుస్థితి. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక శ్రద్దతో బస్ స్టాండ్ నిర్మాణం పూర్తి చేసి రవాణా శాఖ మంత్రి ప్రారంభించి వెళ్లారు. కానీ నేటి వరకు మరుగుదొడ్ల గదులు తాళాలు వేసి వుంటున్నాయి. ఫ్లంబర్ పనుల్లో లోపం వల్ల మరుగుదొడ్లలో నీరు లేక వాటిని మూసి ఉంచారు. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా వెంటనే పనులు చేయించాలి.