కూలిపోయే స్థితిలో ఎల్లారెడ్డి నూతన బస్‌స్టాండ్ ప్రహరీ గోడలు

ఎల్లారెడ్డిలో నూతనంగా నిర్మించిన బస్‌స్టాండ్ ప్రహరీ గోడలు నిర్మాణంలో జరిగిన లోపాల వల్ల ఆందోళనకరంగా నెర్రలు బారుతున్నాయి. మున్సిపల్ నిధులు మరియు ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి ద్వారా మంజూరైన నిధులతో ఈ నిర్మాణం చేపట్టారు. కాగా, బస్‌స్టాండ్ ఆవరణలో వాహనాల పార్కింగ్‌తో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని బుధవారం డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపంపై విచారణ జరిపి, పార్కింగ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు, డ్రైవర్లు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕