హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగులకు ఎలాంటి అపోహలు వద్దు

పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి ఉద్యోగులకు హెల్త్ కార్డుల విషయంలో ఎలాంటి అపోహలు వద్దని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. కామారెడ్డి జిల్లా పిఆర్టియు భావాన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ అటానమస్ బాడీగా ఏర్పాటు అవుతోందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ ఉండదని తెలిపారు. ఈ ట్రస్ట్ కోసం ఉద్యోగుల వేతనాల్లోంచి 1.5 శాతం కోత విధించారని, ముందస్తు సమాచారం లేకుండా వేతనం కట్ కావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్