ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలి

2026లో జరగనున్న మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో, ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని అర్హతగల ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఏ. మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ల కోసం దరఖాస్తులు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్