ప్రతి విద్యార్థి సుస్థిర జాతి ఐక్యతకు కృషి చేయాలి

తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమం ప్రిన్సిపాల్ సయ్యద్ యూసఫ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజనీతి శాస్త్ర అధ్యాపకులు శంకరంపేట వీరేశం మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి సుస్థిర జాతి ఐక్యతకు కృషి చేయాలని సూచించారు. భారత ప్రథమ హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించబడిందని, జాతీయ ఐక్యతపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించామని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్