మాజీ ఎమ్మెల్యే బొమ్మను పచ్చబొట్టుగా వేసుకున్న అభిమాని

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పై భానుకుమార్ అనే అభిమాని తన చేయిపై పచ్చడి బొట్టు బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఎల్లారెడ్డి సెగ్మెంట్ నుండి జాజాల సురేందర్ నే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపిస్తామని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని భానుకుమార్ జోష్యం చెప్పాడు. సురేందర్ వెంట అనేక మంది సైనికులు ఉన్నారని, ఈసారి గెలిపించి చూపిస్తామని ఆయన మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్