ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ కు చెందిన రైతు సాయిబాబాపై మంగళవారం అడవి పందులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అతన్ని ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ ఛైర్మన్ కుడుములు సత్యనారాయణ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి డాక్టర్ తో మాట్లాడారు. అక్కడి నుండే ఫారెస్ట్ అధికారి పృథ్విరాజ్ తో ఫోన్ లో మాట్లాడి సాయిబాబాకి తగిన న్యాయం చేయాలని కోరారు.