ఆయిల్ పామ్ సాగుతో రైతుల ఆదాయం పెంచాలి: కలెక్టర్

ఆయిల్ పామ్ సాగుతో రైతుల ఆదాయం పెంచాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా గ్రామ పంచాయతీని కలెక్టర్ గురువారం  సందర్శించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని, కంపోస్ట్ షెడ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, గ్రామస్థులతో కలెక్టర్ మాట్లాడి, నర్సరీ నిర్వహణ, కంపోస్ట్ తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి, మొక్కల పెంపకం, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్