ఎల్లారెడ్డి సొసైటీలో సభ్యత్వం ఉన్న రైతులు తప్పనిసరిగా ఎఫ్ పీ ఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)లో సభ్యత్వం తీసుకోవాలని సొసైటీ సీఈఓ విశ్వనాథం సూచించారు. బుధవారం జిల్లా సహకార సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, బిక్కనూర్ గ్రామంలో రైతులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ పీ ఓ లో సభ్యత్వం పొందడానికి 2000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, తద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు.