జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) మోహన్ రెడ్డి మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని వెలుట్ల, హిమగిరి శివారులోని వరి నారుమడులను పరిశీలించారు. యాసంగి సీజన్‌లో వరి సాగులో నారుమడి యాజమాన్య పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. పొలంలో నారు నాటే పద్ధతులను కూడా వివరించారు.