అయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం: కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాన్, బుధవారం ఎల్లారెడ్డి సెగ్మెంట్ తాడ్వాయి మండలం ఏండ్రియల్ గ్రామ శివారులో రైతు బొక్క హన్మాండ్లు మూడున్నర ఎకరాలలో సాగు చేస్తున్న అయిల్ ఫామ్ తోటను సందర్శించారు. మొక్కల పెరుగుదల, నిర్వహణ, సాగు పద్ధతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు హన్మాండ్లు 2022లో అయిల్ ఫామ్ సాగు ప్రారంభించి, అంతర్ పంటలుగా కూరగాయలు, సోయబిన్ కూడా వేశానని తెలిపారు. అయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్