ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి..రాజు

నాగిరెడ్డిపేట మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రాజు ఆదివారం నాగిరెడ్డిపేటలో మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ. 12,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్