జలాల్ పూర్ సర్పంచ్ ను సన్మానించిన ఫిలింనగర్ గణేష్ మండలి సభ్యులు

నాగిరెడ్డిపేట్ మండలంలోని జలాల్ పూర్ గ్రామ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని ఫిలింనగర్ గణేష్ మండలి సభ్యుల ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాధుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జలాల్ పూర్ గ్రామ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మరియు పలు సేవ కార్యక్రమాల్లో ఎల్లప్పుడు చురుగ్గా పాల్గొంటారని ఫిలింనగర్ గణేష్ మండలి సభ్యులు వారిని అభినందించి ఫిలింనగర్ గణేష్ మండలి సభ్యుల ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మరియు పలు సేవా కార్యక్రమాల్లో తన వంతు సహాయ సహకారాలు అందజేస్తాన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕