గాంధారి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులచే అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆదేశాల మేరకు అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.